VZM: పోలీసు వెల్ఫేర్ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో ఖాళీగా ఉన్న రెండు ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు జిల్లా ఎస్పీ దామోదర్ సోమవారం తెలిపారు. ఇంగ్లీష్ సబ్జెక్ట్‌ను బోధించేందుకు గానూ డీఈడీ/బీఈడీ అర్హత గల వారు కావాలన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 16న ఉ.10 గంటలకు విజయనగరం పోలీసు వెల్ఫేర్ పాఠశాలలో జరిగే ఇంటర్వ్యూ లకు హాజరుకావాలన్నారు.