WGL: నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాతృమూర్తి కాంతమ్మ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్లపల్లి ప్రణీదీప్ మాదిగ సోమవారం ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి కాంతమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియపరిచారు.