MBNR: బాలానగర్ మండలం పెద్ద రేవల్లి గ్రామంలో సోమవారం ఓ వ్యక్తి మరణించాడు. ఎస్సై లెనిన్ వివరాల ప్రకారం.. ఛత్తీస్గడ్ దంతవాడ జిల్లాకు చెందిన రాము రామ్ కశ్యప్ (22) కార్తికేయ క్రషర్ వద్ద సీతాఫలాలు తెంపేందుకు వెళ్లి ప్రమాదవశత్తు చెట్టు మీది నుంచి కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.