W.G: గత ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుచేసి దాని స్థానంలో సరికొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. సోమవారం పెనుగొండ మండలం సోమరాజు చెరువు, కొటాలపర్రు గ్రామాల్లో పల్లె పల్లెకు మన పితాని కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.