NLG: గర్భిణీలు బాలింతలు పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని మల్లేపల్లి CDPO కతీజ బేగం అన్నారు. పోషణ మాసం సందర్భంగా కొండమల్లేపల్లి ప్రాజెక్టు పరిధిలోని కొందలపాడు రైతు వేదిక కార్యక్రమంలో ఆమె సోమవారం పాల్గొని మాట్లాడారు. పౌష్టికాహారం ఆరోగ్యం పరిశుభ్రతపై తల్లులకు అవగాహన కల్పించారు. పోషక లోపాన్ని తగ్గించడానికి చిరుధాన్యాలు తీసుకోవాలని సూచించారు.