W.G: ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్న కార్తీక మాసం ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ నాగరాణి దేవాదాయ, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్తీక మాసంలో దేవాలయాలు శోభాయమానంగా ఉండేలా సిద్ధం చేయాలన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. పేరుపాలెం బీచ్ వద్ద సముద్ర స్నానాల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.