ATP: తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం టీడీపీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం జేసీ మాట్లాడుతూ.. మీరే నా దేవుళ్లు, నా ధైర్యం అని అభిమానులను ఉద్దేశించి అన్నారు. ఎమ్మెల్యే అష్మిత్ రెడ్డి కష్టపడే నాయకుడని, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని సూచించారు.