సత్యసాయి: రైతుల సంక్షేమమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్యేయమని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి అన్నారు. తలమర్లరాచెరువులో పొంగిప్రవహిస్తున్న నీటికి ఆమె, మాజీ మంత్రి డాక్టర్ రఘునాథ్ రెడ్డి జలహారతి ఇచ్చారు. వర్షాలతో చెరువులు నిండుతుండటం రైతులకు శుభసూచకమని, రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందని పేర్కొన్నారు.