W.G: అనధికారిక లేఅవుట్లు, భవనాలు ఈ నెల 23వ తేదీ లోపు రెగ్యులరైజేషన్ చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఎం. ఏసుబాబు తెలిపారు. సోమవారం తాడేపల్లిగూడెం పురపాలక సంఘ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తదుపరి వచ్చే దరఖాస్తులు తిరస్కరించబడతాయని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని, రెగ్యులరైజ్ చేసుకోవాలని కమిషనర్ కోరారు.