ADB: అందరూ అధికారుల సహకారంతోనే జిల్లాకు అవార్డులు రావడం జరుగుతుందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. నీతి ఆయోగ్ యూజ్ కేస్ చాలెంజ్‌లో భాగంగా జిల్లాకు 4 అవార్డులు వచ్చినందున కలెక్టర్ రాజర్షి షాను అధికారులు సోమవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. విద్య, సామాజిక అభివృద్ధి, ఆరోగ్యం, పోషణ విభాగాల్లో అవార్డు రావడం జరిగిందన్నారు.