ELR: చింతలపూడి ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న కార్మికుల జీతాలు వెంటనే చెల్లించాలని AITU ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు 3 పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలని సంఘం నాయకురాలు మరియమ్మ డిమాండ్ చేశారు. పెండింగ్ జీతాలు ఇవ్వని వారికి మళ్లీ కాంట్రాక్టు ఇవ్వడం ఏంటని ఆమె ప్రశ్నించారు.