ప్రకాశం: జిల్లాలో పూర్తి స్థాయిలో బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలను అరికట్టేలా ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఒంగోలు కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలను అరికట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు.