MDK: కౌడిపల్లి మండలం సలాబత్పూర్ గ్రామానికి చెందిన నెల్లూరి వెంకటేష్(51) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కూతురు వివాహం చేసేందుకు అప్పులు చేయగా అప్పులు తీరలేదు. అప్పులు తీర్చే మార్గం లేక వెంకటేష్ మనోవేదనకు గురై నిన్న రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కుటుంబీకులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.