BDK: జిల్లాకు మంజూరైన కేంద్రీయ విద్యాలయానికి సంబంధించి తాత్కాలిక తరగతి గదులకై కేటాయించబడిన భవనానికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. పాత కొత్తగూడెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆనంద ఖనిలో గల భవన సముదాయాన్ని పరిశీలించి కేంద్రీయ విద్యాలయ సంఘటన్ వారు సూచించిన సూచనలకు అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందించాలన్నారు.