SRPT: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను జిల్లా అధికారులు వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ కే. సీతారామారావు ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరెట్లో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. నేడు నిర్వహించిన ప్రజవాణిలో మొత్తం 57 ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. ప్రజలకు సేవ చేయడమే ఉద్యోగుల బాధ్యత అన్నారు. సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.