E.G: రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని అరికట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని, నకిలీ మద్యం దందాపై సీబీఐతో దర్యాప్తు జరిగేలా చూడాలని నిడదవోలు మాజీ MLA జి.శ్రీనివాస్ నాయుడు కోరారు. సోమవారం నిడదవోలు ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్ఫెక్టర్ జయరాజ్ సతీష్‌కి వినతిపత్రం అందజేశారు. ఈ నిరసనలో వైసీపీ నేతలు పాల్గొన్నారు.