AP: గూగుల్ పెట్టుబడులతో ఏపీ సరికొత్త చరిత్ర సృష్టించనుందని మంత్రి లోకేష్ తెలిపారు. గూగుల్ ప్రాజెక్టు ఇప్పుడు వాస్తవ రూపం దాల్చబోతోందని అన్నారు. ఏపీ ప్రభుత్వంతో రేపు గూగుల్ అవగాహన ఒప్పందం చేసుకోబోతుందని చెప్పారు. గూగుల్ ప్రాజెక్టు విలువ 10 బిలియన్ డాలర్లు అని పేర్కొన్నారు. రాష్ట్ర డిజిటల్ భవిష్యత్తు, ఆవిష్కరణలకు ముందడుగు పడబోతుందన్నారు.