ప్రకాశం: కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపాల్ ఉషారాణి ఆధ్వర్యంలో ‘సూపర్ జీఎస్టీ 2.0 సూపర్ సేవింగ్సై’పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. వ్యాపార పరిశ్రమల స్థాపనకు సంబంధించిన మెలుకువలు, నైపుణ్యాల గురించి వివరించారు. జిఎస్టి 2.0తో ఎలక్ట్రానిక్ వస్తువులు ఇతర వస్తువు ధరలు తగ్గి సామాన్యులకు ఎంతో మేలుచేకూరుతుందని ఆమె వెల్లడించారు.