KMR: రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోయవద్దని ఎస్పీ రాజేష్ చంద్ర రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గతేడాది అక్టోబర్ నెలలో జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 27 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఈ ప్రమాదాల్లో ఎక్కువ భాగం రోడ్లపై మక్కలు,వడ్లు ఆరబెట్టడం వల్ల జరిగాయని పేర్కొన్నారు.