రంగారెడ్డి జిల్లాలోని నందిగామ గ్రామం సోలార్ మయం కానుంది. పైలెట్ ప్రాజెక్టు కింద ఈ గ్రామాన్ని ఎంపిక చేయగా.. ఇందుకుగాను రూ. కోటి రూపాయల నజరానాను అందించనున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అన్ని ప్రభుత్వ సంస్థలు, గృహాలపై సోలార్ పలకలను ఏర్పాటు చేసి నందిగామ గ్రామం నుంచి 1,939 కిలో వాట్ విద్యుత్ ఉత్పత్తి జరిగేలా అధికారులు చర్యలు చేపట్టనున్నారు.