విశాఖ కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 271 విజ్ఞప్తులను స్వీకరించి, అధికారులు అంకితభావంతో అర్జీలను పునరావృతం కాకుండా శాశ్వతంగా పరిష్కరించాలన్నారు. అర్జీదారులతో స్వయంగా మాట్లాడి చర్యలు చేపట్టాలని సూచించారు. వచ్చే సోమవారం అర్జీదారులతో ఫోన్లో మాట్లాడనున్నట్టు కలెక్టర్ తెలిపారు.