GNTR: మంగళగిరి మండలం కాజాలోని రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను కలెక్టర్ తమీమ్ అన్సారియా ఇవాళ పరిశీలించారు. ధాన్యం కొనుగోలు దశలు, సిబ్బంది చేపట్టాల్సిన అంశాలు, పరికరాల పనితీరు, బస్తాలు ఏర్పాటు, రవాణా ఛార్జీల చెల్లింపు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. సమీపంలో ఉన్న వేయింగ్ బ్రిడ్జిని స్వయంగా తనిఖీ చేసి పరిశీలించారు.