ASR: ఈ-క్రాప్ నమోదు వేగవంతం చేయాలని జీకేవీధి ఏవో గిరిబాబు ఆర్ఎస్కేల సిబ్బందిని ఆదేశించారు. సోమవారం రింతాడ రైతు సేవా కేంద్రంలో ఆర్ఎస్కేల ఇంఛార్జ్‌లతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో పర్యటిస్తూ.. రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. పంట సాగులో రైతులకు తగిన సూచనలు అందించాలని తెలిపారు. వరి పంటలో అగ్గి తెగులు సోకినట్టు గుర్తించామని, ట్రైసైక్లోజోల్ పిచికారీ చేయాలన్నారు.