E.G: రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు ప్రధాన సెంటర్లో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టాలని రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్ కోరారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్‌లో అడిషనల్ SP మురళీకృష్ణకి వినతి పత్రం అందజేశారు. బొమ్మూరు సెంటర్లో ట్రాఫిక్ జామ్ వల్ల ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.