నిజామాబాద్ జిల్లాలోని బిక్కనూరు మండల కేంద్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న రిసార్ట్స్‌ను నిలిపివేయాలని పట్టణానికి చెందిన భూపాల్ సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సిద్ధి రామేశ్వర ఆలయం వెనుక భాగంలో గల 1047 సర్వే నంబరులో రెండు ఎకరాలలో అక్రమంగా రిసార్ట్స్ నిర్మిస్తున్నారని ఆయన ఆరోపించారు.