VZM: వేపాడ మండలం చిన్న గుడిపాల గ్రామ ప్రజల నీటి అవసరాల మేరకు స్వచ్ఛమైన నీరును అందించేందుకు హైటెక్ వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే లలిత కుమారి సొంత నిధులతో మంజూరు చేసి సోమవారం ఉదయం ప్రారంభించారు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా పీఎసీఎస్ ఛైర్మన్ గొంపకృష్ణతో పాటు టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.