GDWL: గద్వాలలో సోమవారం రైచూర్ రైల్వే ట్రాక్ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐజ మండలం పులికల్ గ్రామానికి చెందిన శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.