BDK: పాత కొత్తగూడెం ప్రాంతంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలను సోమవారం భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థుల సౌకర్యాలు, పాఠశాల వసతుల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, వసతులు, మధ్యాహ్న భోజన వంటశాల, శానిటేషన్ వ్యవస్థలను ప్రత్యక్షంగా పరిశీలించారు.