ADB: నార్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలలో సోమవారం వైద్యాధికారి రాంబాబు విద్యార్థినులకు సీపీఆర్ పై అవగాహన కల్పించారు. దీనితో శ్వాస, హృదయ స్పందన ఆగిపోయినప్పుడు అత్యవసరమైన సమయాల్లో ప్రాణాలను కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. ప్రతిఒక్కరు CPR నేర్చుకొని ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో డా.జితేంద్ర రెడ్డి, చరణ్ దాస్, సుశీల ఉన్నారు.