GNT: రాష్ట్రంలో ఏరులై పారుతున్న కల్తీ మద్యాన్ని అరికట్టాలని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి అన్నారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మంగళగిరిలో సోమవారం వైసీపీ నేతలు నిరసన తెలిపారు. అనంతరం ర్యాలీగా ఎక్సైజ్ స్టేషన్కు చేరుకుని సీఐ వీరాంజనేయులకు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు పాల్గొన్నారు.