PLD: పెద్దమనుషుల ఓప్పందంతో సర్పంచ్ పదవి ఏకగ్రీవం అయిన సంఘటన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పలపాడు గ్రామంలో జరిగింది. గ్రామంలోని పెద్దమనుషుల ఒప్పందంతో మొగిలి మంగమ్మను ఇవాళ గ్రామ సర్పంచిగా నియమించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్, వైద్యశాల & గ్రామ సచివాలయం స్థలదాత తాడి వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. సర్పంచ్ మంగమ్మ గ్రామ అభివృద్ కృషి చేస్తుందని తెలిపారు.