దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఉదయం నష్టాల్లో ప్రారంభమై.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 173.77 పాయింట్లు లేదా 0.21 శాతం నష్టంతో.. 82,327.05 వద్ద, నిఫ్టీ 58.00 పాయింట్లు లేదా 0.23 శాతం నష్టంతో 25,227.35 వద్ద నిలిచాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.88.76గా ఉంది.