సమాజ్వాదీ(ఎస్పీ) పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చొరబాటుదారుడు అని ఆరోపించారు. ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన ఆయనను అక్కడకు పంపాలని పేర్కొన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు చొరబాటుదారులను ఓటు బ్యాంకుగా పరిగణిస్తున్నాయన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.