NZB: వర్ని మండలంలోని లక్ష్మీసాగర్ తండాకు చెందిన శాంతాబాయి సోమవారం అంబులెన్స్‌లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం నిమిత్తం ఆమెను అంబులెన్స్‌లో తరలిస్తుండగా, లక్ష్మాపూర్ వద్ద నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో 108 సిబ్బంది రాంబాబు, హనుమాండ్లు చాకచక్యంగా ప్రసవం చేశారు. తల్లిబిడ్డలను క్షేమంగా మోస్రా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.