MDK: కొల్చారం పోలీస్ స్టేషన్ పరిధి ఏడుపాయల వద్ద మహిళ హత్య సంఘటన స్థలాన్ని సోమవారం జిల్లా ఎస్పీ డివీ శ్రీనివాసరావు సందర్శించారు. హత్య ఘటనపై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, నిందితులను గుర్తించి పట్టుకునేందుకు వేగవంతమైన దర్యాప్తు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. డీఎస్పీ ప్రసన్నకుమార్, సీసీఎస్ సీఐ కృష్ణమూర్తి, ఎస్సై మొహినుద్దీన్ పాల్గొన్నారు.