BDK: భద్రాచలం ఐటిడిఏలో సోమవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ఐటీడీఏ పీవో రాహుల్ పాల్గొని మాట్లాడుతూ.. ఎంతో నమ్మకంతో వివిధ రకాల సంక్షేమ పథకాల కోసం అర్జీలు పెట్టుకునే గిరిజనులకు ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాలు అందే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించాలని ఆయన సూచించారు.