BPT: సంతమాగులూరు మండలం కామేపల్లిలోని బీసీ అంగన్వాడీ సెంటర్ వద్ద మౌలిక వసతులు కల్పించేందుకు దాతలు ముందుకు వచ్చారు. గ్రామానికి చెందిన నేలపాటి అంజమ్మ కుర్చీలు, బల్లాలు, పలురకాల వస్తువులను అంగన్వాడీ కేంద్రానికి అందజేశారు. మౌలిక వసతులు కల్పించినందుకు ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో సుధా, సూపర్వైజర్ సుష్మ తదితరులు పాల్గొన్నారు.