ELR: రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న కల్తీ మద్యం ఘటనలపై పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన నేతృత్వంలో పోలవరం ఎక్సైజ్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. కల్తీ మద్యం తాగి ప్రజలు చనిపోతున్నా, ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన ఆరోపించారు. ఈవ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.