BDK: మణుగూరు మండలం శివలింగాపురం గ్రామంలో సీపీఐ నాయకులు సమావేశం అయ్యారు. వారు మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజ్, రోడ్లు నాసిరికంగా ఉన్నాయని అధికారుల పర్యవేక్షణ లేకుండా ఇష్టానుసారంగా నిర్మిస్తున్నారని మండిపడ్డారు. ఇది ఇలానే కొనసాగితే సీపీఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.