MHBD: దంతాలపల్లి మండలం రాజా తండా గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వెంకన్న-సునీతల చిన్న కుమారుడు చంటి (12) ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. కుటుంబీకులు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ సోమవారం చంటి మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.