AKP: పంటల సాగులో రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు సలహాలు తీసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ భవాని అన్నారు. కే. కోటపాడు మండలం సూర్రెడ్డిపాలెం, మేడిచర్ల గ్రామాల్లో వ్యవసాయ అధికారి సోమశేఖర్ ఆధ్వర్యంలో పర్యటించి ఎండిపోతున్న వరి పొలాలను సోమవారం పరిశీలించారు. పొలంలో దమ్ము ఎక్కువ చేయడం, సూక్ష్మ పోషకాలు లోపల కారణంగా వరి పొలం ఎండిపోతున్నట్లు గుర్తించారు.