GDWL: CPRపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. సోమవారం ఐడీవోసీ మందిరంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సీపీఆర్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజా జీవితంలో ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని అలాంటి వారికి సీపీఆర్ చేస్తే ప్రాణాపాయం నుంచి బయటపడతారని చెప్పారు.