మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలోని ‘మీసాల పిల్ల’ పాట ప్రోమో SMలో హల్చల్ చేసింది. అయితే ఈ సాంగ్‌ను ఇవాళ విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, ఎడిటింగ్ పనులు ఆలస్యం కావడంతో ఈ పాట విడుదలను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.