సత్యసాయి: హిందూపురం నియోజకవర్గంలో కల్తీ N బ్రాండ్ మద్యం విక్రయాలకు వ్యతిరేకంగా నియోజకవర్గ ఇన్చార్జ్ టీ.ఎన్. దీపీక ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతంరం ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అక్రమ మద్యం తయారీ, విక్రయాల్లో ఎంత పెద్దవారు ఉన్నా అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.