VZM: తొలగించిన కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి కొనసాగించకపోతే పోరాటం తప్పదని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ డిమాండ్ చేశారు. నెల్లిమర్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కార్మికులతో కలిసి సోమవారం నిరసన తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులు నడుపుతూ ప్రభుత్వ వైద్యాధికారులుగా విధులు నిర్వహించవచ్చా? సూపరింటెండెంట్ తిరుమల దేవి ఆలస్యంగా విధులకు హాజరవుతున్నారన్నారు.