GNTR: గుంటూరు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంను ఇవాళ నిర్వహించారు. కాగా ఈ కార్యక్రమంలో గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. అనంతరం నగరవాసుల సమస్యలు విని, వారి నుంచి అర్జీలను స్వీకరించారు. మేయర్ ప్రతి అర్జీని పరిశీలించి వాటిని పరిష్కరించేందుకు అధికారులతో మాట్లాడారు.