AP: ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. విశాఖలో పెట్టుబడుల సదస్సుకు ప్రధానిని చంద్రబాబు ఆహ్వానించనున్నారు. సీఎం వెంట కేంద్రమంత్రులు రామ్మోహన్, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. గూగుల్ అనుబంధ సంస్థ రైడన్ ద్వారా విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. రూ.84 వేల కోట్లతో డేటా సెంటర్ను మొదలు పెట్టనున్నారు.