MNCL: జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని మహిళా సంఘం జిల్లా కమిటీ సభ్యురాలు పోతు విజయ కోరారు. సోమవారం జన్నారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని అధికారులకు వినతిపత్రం సమర్పించారు. అన్ని గ్రామాలలో రోడ్లు, డ్రైనేజీలను నిర్మించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తు స్వీకరణను ప్రారంభించాలని కోరారు.