GDWL: అయిజ మున్సిపాలిటీలో నిర్మాణం చివరి దశలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC) పనులు పూర్తి చేయించి, త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని బీఆర్ఎస్వీ గద్వాల జిల్లా కో-ఆర్డినేటర్ కురువ పల్లయ్య కోరారు. సోమవారం ఆయన కలెక్టర్ సంతోష్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. సీహెచ్‌సీ అందుబాటులోకి రాకపోవడంతో నాలుగు మండలాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు.