NLG: వర్షాలకు ధాన్యం తడిసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్యలు డిమాండ్ చేశారు. చిట్యాలలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో వర్షాలకు తడిసిన ధాన్యాన్ని సోమవారం సీపీఎం, రైతు సంఘం ప్రతినిధులు పరిశీలించారు. అవసరమైన పట్టాలు, తార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని అధికారులను కోరారు.